లక్ష్మీస్ ఎన్టీఆర్' తో బండారం బయటకు: లక్ష్మీపార్వతి

in #tupaki6 years ago

I am promoting this site :

మార్చి 23న రామ్ గోపాల్ తీసిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం విడుదల కాబోతుంది. సాధారణంగానే ఆయన సినిమాలంటే సంచలనంగా ఉంటాయి. కానీ ఈసారి ఆయన తీసిన సినిమాపై తీవ్ర ఆసక్తి నెలకొంది. సవాళ్లను విసురుతోంది. వర్మ పట్టు పట్టి మరీ తీసిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' విడుదలపై ఇప్పుడు తెలుగు ప్రజలు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ ది అసలైన బయోపిక్ అని చెబుతున్న ఆర్జీవీ ఇదే అసలైన చరిత్ర అని ఇదివరకే స్పష్టం చేశారు. వాస్తవాలను చిత్రీకరించడంలో ఏమాత్రం భయపడలేదని అన్నారు. దీంతో ఈ సినిమా రాక కోసం అందరూ ఎదురు చూస్తున్నారు.

ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతిని ప్రధానంగా తీసుకొని తీసిన ఈ సినిమా ఈరోజు లక్ష్మీపార్వతి స్పందించారు.. 'మీ పాపం పండింది.. నన్ను ఎన్నో విధాలుగా అవమానించారు.. ఎన్నో వేధింపులకు గురి చేశారు.. మహిళా అని చూడకుండా హేళన చేశారు. నా భర్త ఎలాంటివాడో ఈ సినిమాలో చూపించారు ఆర్జీవీ.. ఇదివరకు వచ్చిన సినిమాల్లో పచ్చి అబద్ధాలను చూపించారు.. కానీ ఈ సినిమాలో ఉన్నవన్నీ నిజమే.'

'ఎన్టీఆర్ తో నాకున్న సంబంధాన్ని వక్రంగా చెప్పారు. ఒక మహిళ తన భర్తను ఎంతగా ప్రేమిస్తారో ఈ సినిమా ద్వారా చూపించాం. ప్రజలకు వాస్తవాలు అందబోతున్నాయి. నేనేంటో నిరూపిస్తా.. కొందరు నాపై అపనిందలు వేస్తే నమ్మారు.. అసలు నిజాలెంటో ఇప్పుడు చూడండి' అని లక్ష్మీ పార్వతి ఉద్వేగంగా తెలిపారు.

'ఏ విషయాలైనా ప్రజలకు నిజాలు చెప్పే ప్రయత్నం చేయాలి.. ఇటీవల ఎన్టీఆర్ జీవితంపై వచ్చిన సినిమాలో ఒక్కటి నిజమనిపించలేదు. తమకు అనుకూలంగా సినిమా తీయడం ద్వారా ప్రయోజనమేంటో వారు చూశారు.. మాకు ప్రయోజనాలతో పనిలేదు. ప్రజలకు నిజం తెలిస్తే చాలు' అని లక్ష్మీ ఎన్టీఆర్ సినిమాపై లక్ష్మీ పార్వతి భావోద్వేగంతో స్పందించారు.

Coin Marketplace

STEEM 0.22
TRX 0.26
JST 0.039
BTC 94279.77
ETH 3336.73
USDT 1.00
SBD 3.14