tirumala \❗️/ tirupathi మార్చి 30వ తేదీ నుండి శ్రీవారి సేవకు ఆన్‌లైన్‌లో వ్యక్తిగత నమోదుకు అవకాశం
tirumala \❗️/ tirupathi
మార్చి 30వ తేదీ నుండి
శ్రీవారి సేవకు ఆన్‌లైన్‌లో వ్యక్తిగత నమోదుకు అవకాశం
తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు సేవలందించేందుకు ఉద్దేశించిన శ్రీవారిసేవకు మార్చి 30వ తేది నుంచి ఆన్‌లైన్‌లో వ్యక్తిగతంగా నమోదు చేసుకునే అవకాశాన్ని టిటిడి కల్పించింది. శ్రీవారి సేవను మరింత పటిష్ఠం చేసేందుకు గతేడాది నవంబర్ నుంచి 3 రోజులు, 4 రోజులు, 7 రోజుల సేవను ఆన్‌లైన్‌లో బృందంగా నమోదు చేసుకునే ప్రక్రియను ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి మరింత ఎక్కువ మంది యువతను, ఉద్యోగులను శ్రీవారి సేవలో భాగస్వాములను చేసేందుకు వ్యక్తిగతంగా నమోదు చేసుకునేందుకు వీలుగా ఆన్‌లైన్ అప్లికేషన్‌లో మార్పులు చేపట్టింది. ఈ నూతన విధానంలో మార్చి 30వ తేదీన వ్యక్తిగతంగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే శ్రీవారి సేవకులు ఏప్రిల్ 9వ తేది నుంచి తిరుమలలో సేవలు అందించాల్సి ఉంటుంది.