కాజల్‌ సినిమాలు మానేస్తోందా?

in #ss7 years ago

కాజల్‌ సినిమాలు మానేస్తోందా?
‘చందమామ’ సమాధానం ఇది

టాలీవుడ్‌ ‘చందమామ’ కాజల్‌ అగర్వాల్‌ సినిమాలు మానేస్తోందని కొంతకాలంగా టాలీవుడ్‌లో వూహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తికాగానే సినీ రంగానికి స్వస్తి పలికి వ్యాపార రంగంలోకి ప్రవేశించనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ పుకార్లపై కాజల్‌ ఓ ఆంగ్ల మీడియా ద్వారా స్పందించారు.‘సినిమాలు మానేస్తున్నట్లు నాపై వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. సినిమాలు వదిలి వేరే వ్యాపారాలు చేసే ఉద్దేశం కూడా లేదు. ఈఏడాది ‘ఖైదీ నెం.150’, ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘వివేగం’, ‘మెర్సల్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాల్లో నటించాను. ఇంత మంచి అవకాశాలు, విజయాలు అందుతున్నప్పుడు సినిమాలు మానేయాల్సిన అవసరం నాకేంటి?’ అన్నారు.
అనంతరం తాను పనిచేసిన దర్శకులు, నటుల గురించి మాట్లాడుతూ.. ‘తేజ సర్‌ నాకు మెంటర్‌. ఆయనతో కలిసి పనిచేయడం ఇది రెండోసారి. ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాలో నేను ఇంతవరకు చేయని పాత్రలో నన్ను చూపించారు. ఇక ‘వివేగం’ చిత్రంలో అజిత్‌తో కలిసి నటించాను.ఆయన సెట్‌లో లైట్‌బాయ్‌ దగ్గర నుంచి దర్శకుడి వరకు అందరితోనూ స్నేహంగా ఉంటారు. అజిత్‌కు సినిమా పట్ల ఎంత ఆసక్తి ఉందో ఆయన నటనతోనే తెలిసిపోతుంది. సహ నటులకు కూడా సాయం చేస్తుంటారు. ఆయన పక్కన ఉంటే ఆ వాతావరణం అంతా పాజిటివిటీతోనిండిపోతుంది.’

‘ఇక విజయ్‌ గురించి చెప్పాలంటే ట్యాలెంట్‌ ఉన్న వ్యక్తి. పరిశ్రమలో కష్టపడి పనిచేసే నటుల్లో ఒకరు. ఎలాంటి పాత్రనైనా అవలీలగా చేయగలిగే నటుడాయన’ అని చెప్పుకొచ్చారు.

Coin Marketplace

STEEM 0.25
TRX 0.22
JST 0.038
BTC 97264.48
ETH 3237.02
SBD 5.47