భారత్ లో లీటర్ పెట్రోలు 300 రూపాయలు కానుందా?steemCreated with Sketch.

in #petroleum7 years ago

petrol-pump-759.jpg

హైదరాబాద్: సౌదీ అరేబియా, ఇరాన్ దేశాల యుద్ధవాతావరణం నెలకొంది. గత కొంత కాలంగా ఈ రెండు దేశాలు చేపట్టిన చర్యలు యుద్ధం దిశగా పయనిస్తున్నాయి. ఈ పరిస్థితులపై అంతర్జీతీయ ముడిచమురు మార్కెట్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైతే దాని ప్రభావం క్రూడ్ ఆయిల్ సరఫరాపై పడుతుందని, ప్రధానంగా రెండు దేశాల నుంచి ముడి చమురు దిగుమతి చేసుకునే భారతీయ చమురు మార్కెట్ పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అంతర్జాతీయ ఇంధన మార్కెట్ నిపుణులు అంచనావేస్తున్నారు. ఆ రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైతే ముడి చమురు సరఫరా తగ్గిపోతుందని, తద్వారా ధర 500 రెట్లు పలుకుతుందని వారు అంచనావేస్తున్నారు. దీంతో వివిధ దేశాల్లో ఆయిల్ సంక్షోభం ఏర్పడనుందని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఆ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే భారత్ లో ప్రస్తుతం 70 రూపాయలకు దొరుకుతున్న లీటర్ పెట్రోల్ ధర 300 రూపాయలు అయ్యే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ అక్కడితో ఆగిపోతే ప్రశాంతంగా ఉంటుందని అంతా ఆశిస్తున్నారు.

Coin Marketplace

STEEM 0.23
TRX 0.24
JST 0.039
BTC 105107.73
ETH 3270.10
SBD 5.53