‘అగ్ని సాక్షిగా’’ వివాహం ఎందుకు చేస్తారు..?

in #marraige7 years ago

‘అగ్ని సాక్షిగా’’ వివాహం ఎందుకు చేస్తారు..?

‘‘సోమ: ప్రధమో వివిధే, గంథర్వో వివిధ ఉత్తర:''
త్రుతీయాగ్నిష్టే పతి: తురీయప్తే మనుష్య చౌ:''

అని వివాహ సమయంలో వరుడు స్త్రీతో అంటాడు. అంటే నిన్ను ప్రారంభ కాలంలో సోముడూ, తర్వాత గంధర్వుడూ ఆ తర్వాత అగ్నీ ఏలారు. ఇహ నాల్గవ వానికి గా నేను నిన్ను ఏలుతాను అని అర్ధం.
అమ్మాయి పుట్టిన వెంటనే తన ఆలనా పాలనా చూడవలసినది సోముడు(చంద్రుడు). ఎన్ని సార్లు చూసినా చంద్రుడు ఎంత ఆకర్షణీయంగా ఉంటాడో అలానే పసి పాపను చూసినప్పుడు కూడా అదే భావన కలగటానికి కారణం చంద్రుని పాలన.
వయస్సు వచ్చాక గంధర్వునికి ఇచ్చేసి చంద్రుడు వెళిపోతాడు. ఇప్పుడు ఆమెని చంద్రుని సాక్షిగా గంధర్వుడు స్వీకరిస్తాడు.
‘‘లావణ్యవాన్ గంధర్వ:'' అన్నట్టు గంధర్వుడు ఆమెలో అందాన్ని ప్రవేశపెడతాడు. గంధర్వులు గాన ప్రియులు కనుక అందమయిన కంఠాన్ని లేదా సంగీతాన్ని ఇష్టపడే మనసుని ఇస్తాడు. అలా అందాన్ని, చందాన్ని ఇచ్చేసినా పనయిపోయిందిఇక నీదే పూచీ అని కన్యని అగ్నికి అప్పచెప్పి గంధర్వుడు వెళ్ళిపోతాడు.
ఇప్పుడు ఆమెని గంధర్వుని సాక్షిగా అగ్ని స్వీకరించాడు. ‘‘images.jpg

Coin Marketplace

STEEM 0.15
TRX 0.25
JST 0.032
BTC 93922.24
ETH 1799.51
USDT 1.00
SBD 0.86