My quotes

in #life7 years ago

Gampa Nageshwe:
మనం పుట్టినప్పుడు మనల్ని ఎవరు వచ్చి
చూశారో మనకు తెలియదు.......మనం మరణించాక మనల్ని ఎవరు చూడటానికి వస్తారో కూడా మనకు తెలియదు.....కాబట్టి మనం బ్రతికి
ఉన్నప్పుడు మనతో ఉన్నవాళ్ళను మనసారా ప్రేమించండి.
ఆప్యాయతలను పంచండి... మీరు మరణించి కూడా జీవించేలా
మానవత్వాన్ని చాటండి.......ఇలాంటి చిన్న కథలతో కనీసం మనలో
కొంతమంది అయినా మారితే చాలు..
ఇక ఈ చిన్న కథను చదవండి విసుగులేకుండా................

" ఏవండీ! మీరు ఈరోజు ఏదో ఒక నిర్ణయం తీసుకోవల్సిందే1 ఈ ఇంట్లో
నేనైనా ఉండాలి లేదా మీ అమ్మగారైనా ఉండాలి. నావల్ల కావడంలేదు."
అంటూ రుసరుస లాడుతోంది సరళ.......
" ఉన్నట్టుండి ఏమైంది సరళా! ఇంత సీరియస్ గా ఉన్నావు. కాస్త
నెమ్మదిగా చెప్పచ్చుకదా. ఆ ముసల్ది మళ్ళీ నిన్ను ఇబ్బంది పెట్టిందా?
నువ్వేం కంగారు పడకు రేపు ఖచ్చితంగా ఓల్డేజ్ హోం కు తీసుకెళతాను
ఇప్పుడు కాస్త రెలాక్స్ అవ్వు. సాయంకాలం సినిమాకు వెళ్ళి
అటునుండి హోటలుకు వెళ్ళి ప్రశాంతంగా ఉందాం పద " అన్నాడు
కిరణ్......
మర్నాడు ఉదయమే లేచి అమ్మతో ఇలా అన్నాడు.
" అమ్మా! మీ ఇద్దరి గోల నేను పడలేను నేను కొద్దిరోజులు ప్రశాంతంగా
ఉండాలంటే నువ్వు ఓల్డేజ్ హోం కు వెళ్ళాల్సిందే త్వరగా బయలుదేరు"
" అయ్యో! నేనేమీ అనలేదురా! స్నానానికి కాస్త వేడినీళ్ళు పెట్టి ఇవ్వమని
అడిగాను అంతే! చలిగా ఉంది కదరా! అంతదానికి నన్ను బయటకు
పంపకు రా! నేను మనవడితో మనవరాలితో గడుపుతున్నాను.
ఇంకోసారి కోడలిని ఇబ్బంది పెట్టను. మీకు దూరంగా బ్రతకలేను రా"
అంటూ బ్రతిమలాడింది తల్లి.
" నేను చస్తే కానీ నీకు శాంతం ఉండదుకదా! ఇప్పుడే చస్తాను ఉండు"
అన్నాడు కిరణ్......
" వద్దు రా! నేనే వెళ్ళిపోతాను నువ్వెం చేసుకోకు..." అంటూ తన బట్టలను
సర్ధుకుని బయలుదేరింది అమ్మ ఓల్డేజ్ హోం కు......
కొద్దిరోజులు గడిచాయి......ఆదివారం మాత్రమే వెళ్ళి అమ్మను చూసి వచ్చే
వాడు కిరణ్,,,,,ఒక ఆదివారం కిరణ్ తన కుటుంబంతో సంతోషంగా గడిపి
వస్తుండగా ఒక లారీ వీళ్ళ స్కూటరును గుద్దేసి వెళ్ళిపోయింది.
పిల్లలకు , కిరణ్ కు స్వల్ప గాయాలయ్యయి. కానీ సరళకు గాజుముక్కలు
వీపుకూ.....కంటికి గుచ్చుకున్నాయి. హాస్పిటల్ కు తీసుకుని వెళ్ళాడు
కిరణ్ . డాక్టరు ఆమెకు కంటి చూపు పోతుందనీ.......ఎవరైనా కళ్ళను
దానం చేసేవారుంటే తప్ప ఆమెకు నయం కాదని చెప్పేశారు.
అప్పుడే హోం నుంచి అమ్మ ఫోను చేసింది. ఆదివారంకదా ఇంకా
రాలేదే అని అడిగి విసిగిస్తుందని కిరణ్ ఫోను లిఫ్టు చేయలేదు.
మళ్ళి ఫోను వచ్చింది. ఈ సారి ఫోను స్విచాప్ చేశాడు కిరణ్.......
ఆపరేషను ధీయేటరులోనిని అనుమతితో వెళ్ళాడు కిరణ్.....
భార్యకు దైర్యం చెప్పాడు నీకు ఏమీ కాదనీ ఎవరో ఒకరు కళ్ళను
దానం చేస్తారనీ.ఎంత డబ్బైనా సరే నీకు ఆపరేషను చేయిస్తాననీ
సరళ తో చెప్పాడు కిరణ్.........
" ఇవన్నీ సరే! మీ అమ్మను అలా హోంలో చేర్చడం వల్లనే నాకు
ఇలా జరిగింది. నాకు బుద్ది రావడానికి దేవుడే నాకు ఈ శిక్షను
ఇచ్చాడేమో ! ఒకవేళ నాకు ఆపరేషను జరిగి కళ్ళ చూపు వస్తే
ముందుగా నేను మీ అమ్మగారిని చూడాలి ఆమెను క్షమించమని అడగాలి"
ముందు వెళ్ళి అమ్మను తీసుకొచ్చేయండి.
అంటూ బోరున ఏడ్చింది సరళ......
" అమ్మ ఫోను చేసింది . నేను ఫోను తీయలేదు. పైగా స్విచ్ ఆప్ చేశాను
ఎందుకు ఫోను చేసిందో మరి కనుక్కుంటాను. నువ్వు కోరుకున్నట్లుగానే
అమ్మను తీసుకుని వస్తాను " అన్నాడు కిరణ్........
ఎవరో కళ్ళను దానం చేస్తాం అని ఫోను రాగానే ఆసుపత్రివాళ్ళు ఆ కళ్ళను
సరళకు పెట్టడానికి నిశ్చయించుకుని కిరణ్ తో సంప్రదించారు.
ఏర్పాట్లు జరగసాగాయి.
ఈ సమయంలో హోం కు ఫోను చేశాడు కిరణ్.......అక్కడి సిబ్బంది ఇలా చెప్పారు.
" నువ్వు ఒక కొడుకువా! నవమాసాలు మోసి కని.......ఎంతో కష్టపడ్డ
తల్లిని అనాధగా వదిలివెళ్ళావు. ఆదివారం ఆమె ఆరోగ్యం పూర్తిగా
క్షీణించింది. నిన్ను నీ కుటుంబాన్ని చూడాలన్న ఆశతో నీకు ఫోను
చేస్తే స్విచ్ ఆఫ్ చేసావు కదా! చనిపోతూ నువ్వు వస్తావని
తన చూపంతా గుమ్మంవైపే ఉంచి చనిపోయింది నీ తల్లి. చీ.నువ్వు
ఒక మనిషివా? "
ఆయ్యో ! అమ్మ చనిపోయిందా అమ్మ శరీరం ఇప్పుడు ఎక్కడ
ఉందో చెప్పండి " అని భోరున ఏడుస్తూ అడిగాడు కిరణ్...
మా హోం లో అనాధలు ఎవరైన చనిపోతే వారి అవయవాలను దానం
చేస్తా్ము. నీకు చెప్పి చేద్దామని చూశాము. కుదరలేదు. ఇక్కడి
దగ్గరలోనే ఒక హాస్పిటల్ కు ఆ కళ్ళను ఇచ్చాము. బ్రతికి ఉండగా
తల్లిని చూడలేకపోయావు. ఇప్పుడైనా నీ తల్లి కళ్ళను దర్శించుకో
కాస్త అయినా నీ పాపం తగ్గుతుంది. " అని హాస్పిటల్ అడ్రసు చెప్పారు.
ఆ హాస్పిటల్ కు పరుగుపరుగున వెళ్ళాడు. అది తన భార్యను చేర్చిన
హాస్పిటలే......కళ్ళను దానం చేసింది సరళకే అని తెలుసుకున్నాడు.
అమ్మా! అమ్మా! అంటూ క్రిందపడి బోరు బోరున విలపించసాగాడు కిరణ్.....
తను చనిపోయినా మమ్మల్ని చూసుకోవాలన్న ఆశ అమ్మకు పోలేదు.
అందుకే మళ్ళీ మా ఇంటికే వచ్చింది. నా అమ్మను బాధపెట్టిన
నాకు సాధారణ మరణం రాకూడదు....అంటూ సణూగుతూనే ఉండిపోయాడు
కిరణ్.............
ప్రతి ఒక్కరికీ కుటుంబం ముఖ్యమే! కానీ తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేయకూడదు.
పిల్లల్ని హాస్టల్లో చేర్చడం క

Coin Marketplace

STEEM 0.26
TRX 0.22
JST 0.038
BTC 96380.68
ETH 3214.26
SBD 6.12