ఫిబ్రవరి 21న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

in #gk6 years ago

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 21వ తేదీన కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆలయంలో ఫిబ్రవరి 24 నుండి మార్చి4వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న విషయం విదితమే. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.

ఈ సందర్భంగా గురువారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహిస్తారు. ఉదయం 6.00 నుండి 10.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుంది. ఈ కారణంగా ఉదయం 6.00 నుండి 11.00 గంటల వరకు ఆలయ తలుపులు మూసి ఉంచుతారు. కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం సందర్భంగా ఆలయంలో తిరుప్పావడ సేవ రద్దు చేశారు.

బహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ ఉదయం సాయంత్రం

24-02-2019(ఆదివారం) ధ్వజారోహణం పెద్దశేష వాహనం

25-02-2019(సోమవారం) చిన్నశేష వాహనం హంస వాహనం

26-02-2019(మంగళవారం) సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం

27-02-2019(బుధవారం) కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం

28-02-2019(గురువారం) పల్లకి ఉత్సవం(మోహినీ అవతారం) గరుడ వాహనం

01-03-2019(శుక్రవారం) హనుమంత వాహనం స్వర్ణరథం,గజ వాహనం

02-03-2019(శనివారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం

03-03-2019(ఆది వారం) రథోత్సవం అశ్వవాహనం

04-03-2019(సోమవారం) చక్రస్నానం ధ్వజావరోహణం

ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ హరికథలు, సంగీత కచేరీలు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల కారణంగా ఆలయంలో అన్ని రకాల ఆర్జితసేవలను టిటిడి రద్దు చేసింది.

Sort:  

Congratulations @subbu5208! You have completed the following achievement on the Steem blockchain and have been rewarded with new badge(s) :

You published more than 50 posts. Your next target is to reach 60 posts.

Click here to view your Board
If you no longer want to receive notifications, reply to this comment with the word STOP

To support your work, I also upvoted your post!

You can upvote this notification to help all Steemit users. Learn why here!

Coin Marketplace

STEEM 0.28
TRX 0.24
JST 0.041
BTC 95342.28
ETH 3298.03
USDT 1.00
SBD 6.92