ఫిబ్రవరి 11, 12వ తేదీల్లో ప్రోటోకాల్‌ ప్రముఖులకు విఐపి బ్రేక్‌ దర్శనాలు ప‌రిమితం in tirupati tirumal devastanam

in #gk6 years ago

తిరుమల శ్రీవారి ఆలయంలో ఫిబ్రవరి 12న రథసప్తమి పర్వదినం సందర్భంగా సామాన్య భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఫిబ్రవరి 11, 12వ తేదీల్లో విఐపి బ్రేక్‌ దర్శనాలను ప్రోటోకాల్‌ ప్రముఖులకు మాత్రమే టిటిడి పరిమితం చేసింది.

అదేవిధంగా, ఫిబ్రవరి 12న చంటిపిల్లల తల్లిదండ్రులకు, వయోవృద్ధులు, దివ్యాంగులకు, దాతలకు సుపథం మార్గంలో కల్పించే ప్రత్యేక దర్శనాలను టిటిడి రద్దు చేసింది.

కాగా, ఫిబ్రవరి 12న రథసప్తమినాడు శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జితసేవలైన అష్టదళపాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలు ర‌ద్ద‌య్యాయి. సుప్రభాతం, తోమాల, అర్చన సేవ‌ల‌ను ఏకాంతంగా నిర్వహిస్తారు.

ఫిబ్ర‌వ‌రి 12న అంగ‌ప్ర‌ద‌క్షిణ టోకెన్లు ర‌ద్దు

    ర‌థ‌స‌ప్త‌మి ప‌ర్వ‌దినం కార‌ణంగా ఫిబ్ర‌వ‌రి 12న అంగ‌ప్ర‌ద‌క్షిణ టోకెన్ల‌ను టిటిడి ర‌ద్దు చేసింది. భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి స‌హ‌క‌రించాల‌ని టిటిడి కోరింది.

Coin Marketplace

STEEM 0.18
TRX 0.24
JST 0.034
BTC 96289.29
ETH 2670.12
SBD 0.43